PDPL: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈసారి నిర్వహించే గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా శ్రీ గణేష్ ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. గోదావరిఖని VHP భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులుగా దాడి శ్రీనివాస్, ములుకుంట్ల శ్రీనివాస్, కోశాధికారిగా నేరేడుకొమ్మ వెంకటస్వామిని నియమించారు. ఈనెల 27న గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.