KNR : ఉమ్మడి జిల్లాలో ‘సర్కారీ’ భవనాల్లో’ సౌర కాంతులు వెలుగనున్నాయి. విద్యుత్ బిల్లుల సమస్యను అధిగమించడం, సంప్రదాయ వనరుల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వం సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ ఆఫీసులకు బిల్లుల భారం తగ్గించేందుకు ఈ విద్యుత్తును ఎంచుకుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల పైలెట్ ప్రాజెక్టులను చేపట్టింది.