CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరిగింది. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగి, తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలతో పాటు 11 రోజుల ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.