TG: భారీ వర్షాల నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(JNTU) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రద్దు చేసిన పరీక్షల రీషెడ్యూల్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.