SRD: సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర నెంబర్ 08455 – 276155 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బంది పడితే ఈ నెంబర్ కు ఫోన్ చేయాలని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపడతారని పేర్కొన్నారు.