AP: విశాఖ విమానాశ్రయానికి మంత్రి లోకేష్ చేరుకున్నారు. ఈ క్రమంలో అనిత, భరత్, పల్లా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ప్రజలు, కార్యకర్తల నుంచి లోకేష్ అర్జీలను స్వీకరించారు. కాగా రేపు లోకేష్ విశాఖలో పర్యటించనున్నారు. వైజాగ్ కన్వెన్షన్‌లో ICAI నేషనల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. అనంతరం చంద్రంపాలెం ZP స్కూల్లో AI ల్యాబ్స్‌ను ప్రారంభించనున్నారు.