KMR: వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న చోట, రోడ్లు తెగిపోయిన ప్రాంతాల్లో తక్షణమే బారికేడ్లు ఏర్పాటు చేయాలని కామారెడ్డి SP రాజేశ్ చంద్రను మంత్రి సీతక్క ఆదేశించారు. KMM జిల్లాలో గతంలో జరిగిన ఒక దుర్ఘటనను ఉదహరిస్తూ, వరద ఉద్ధృతిని అంచనా వేయలేక యువ సైంటిస్ట్, ఆమె తండ్రి చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.