BDK: దమ్మపేట మండలం నెమలిపేట గ్రామంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ముంపుకు గురైంది. మేము సైతం ఫౌండేషన్ మరియు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ముంపు బాధితులకు గురువారం సాయంత్రం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మేము సైతం ఫౌండేషన్ వైస్ ఛైర్మెన్ షేక్ జాన్, బీజేపీ నాయకులు పల్లపు వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.