MBNR: జడ్చర్ల పట్టణంలోని 25వ వార్డు వెంకటేశ్వర నగర్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీలో గురువారం జరిగిన వినాయక పూజా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ గణనాథుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కాంక్షించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.