VKB: యూరియా కోసం రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, అవసరం మేరకు యూరియాను సప్లై చేస్తున్నామని వికారాబాద్ మండల వ్యవసాయ అధికారిణి ప్రసన్నలక్ష్మి గురువారం తెలిపారు. వికారాబాద్ మండలంలోని ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా నిల్వలు లేవని, కేవలం ఆగ్రో పీఏసీఎస్‌ల్లో యూరియా సప్లై కావడంతో రైతులు క్యూలైన్లో నిల్చొంటున్నారన్నారు. అందరికి సరిపడా యూరియాను సప్లై చేస్తున్నామన్నారు.