TPT: తొట్టంబేడు మండలం బోనుపల్లి దళితవాడకు చెందిన కొప్పల రమేష్ (44) కొయ్య బొమ్మల కళాకారుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ మేరకు 10 రోజుల కిందట ప్రమాదవశాత్తు కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే తిరుపతిలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. అతనికి భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు.