HYD: షేక్‌పేట డివిజన్లోని ఓయూ కాలనీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం పర్యటించారు. ఇటీవల వర్షాలకు నీట మునిగిన కాలనీలో వరద ముప్పును నివారిస్తూ చేపట్టిన కాలువల అనుసంధాన పనులను పర్యవేక్షించారు. వరద ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 19లో నాలాను ఆక్రమించినట్లు వచ్చిన ఫిర్యాదును పరిశీలించారు.