TPT: చిల్లకూరు మండలం తీపనూరు గ్రామానికి చెందిన కన్నా శ్రీనివాసులు(21) వరగలి క్రాస్ రోడ్డులో మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ మేరకు POCSO కేసులో ముద్దాయికి 26 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నెల్లూరు ఫోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ గురువారం తీర్పు ఇచ్చారు. అనంతరం ఈ కేసును వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్‌ను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.