MNCL: మంచిర్యాల- పెద్దంపేట రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని రైలు కింద పడి గురువారం పాత గర్మిళ్ళకు చెందిన వైద్య సత్యమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్తతో పాటు ముగ్గురు కొడుకులు, ఒక్క కోడలు వేర్వేరు కారణాలతో ఇప్పటికే మృతి చెందారు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు జీఆర్పీ ఎస్సై మహేందర్ తెలిపారు.