WNP: ఘనపూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా వల్లూరు వెంకటేష్ గురువారం బాధ్యతలు చేపట్టారు.అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. అంకితభావంతో విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్సైకి సూచించారు.