అన్నమయ్య: సులభతర వ్యాపారంపై కేంద్ర సర్వేలో సానుకూల స్పందన లభించిందని, దీని వలన అన్నమయ్య జిల్లాకు పెట్టుబడులు ఆకర్షితమయ్యే అవకాశముందని మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి తెలిపారు. ఇందులో భాగంగా గురువారం రాయచోటి కలెక్టరేట్లోని జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2024 అవుట్ రీచ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.