NGKL: పదర మండలానికి చెందిన బండి నందిని, కబడ్డీ అండర్-18 విభాగంలో ఇండియా క్యాంపునకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన నందిని, ఢిల్లీలోని ఇండియా క్యాంపునకు బయలుదేరి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులు రమేశ్,రామా దేవి సంతోషం వ్యక్తం చేశారు.