TG: హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. ఉస్మాన్‌సాగర్ 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాశయం ఇన్‌ఫ్లో 1,600 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,404 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఈ జలాశయం ఇన్‌ఫ్లో 2,500 ఉండగా, ఔట్‌ఫ్లో 2,300 క్యూసెక్కులుగా ఉంది.