NDL: బేతంచర్ల మండల రంగాపురం గ్రామంలో రూ. 13 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ ప్రజలు గ్రంథాలయం ద్వారా జ్ఞానం పొందేందుకు సభ్యత్వం తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు.