SRPT: గోవిందాపురంలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్ పనుల్లో నాణ్యతా లోపాలు నెలకొన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్స్ వాడుతున్నట్లు, కేటాయించిన ఇసుకను ఇతర పనులకు తరలిస్తున్నట్లు ఆరోపించారు. భవిష్యత్లో భవనం కూలిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటూ, మున్సిపల్ కమిషనర్ తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.