NGKL: భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగి క్షణికావేశంలో భార్య కేసరి సముద్రం చెరువులోకి దూకింది. కాపాడబోయి భర్త నీటిలోకి దూకడంతో వరద ఉధృతికి ఇద్దరు కొట్టుకుపోయారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ కేసరి సముద్రం అలుగు దగ్గర గురువారం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న స్థానికులు గమనించి దంపతులను ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.