W.G: ఈలంపూడి గ్రామంలోని 48వ నంబర్ రేషన్ షాపును జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రేషన్ సరుకులు, రికార్డులను పరిశీలించారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెల 26వ తేదీ నుంచి ఇంటి వద్దనే రేషన్ అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను జేసీ లబ్ధిదారులకు అందజేశారు.