BDK: సారపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు బత్తుల వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. సారపాకలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, సుందరయ్య నగర్లో మిగిలిపోయిన సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలని కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.