SRCL: చందుర్తి మండలం బండపల్లి కి చెందిన నేరెళ్ల తిరుపతి- వనిత దంపతుల కుమార్తె పూజిత(21) గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏడాది క్రితం నర్సింగాపూర్‌కు చెందిన ఓ యువకుడిని ప్రేమవివాహం చేసుకున్న పూజిత, 6 నెలల క్రితం కలహాలతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. నెలరోజుల క్రితం భర్తతో విడాకులు కూడా తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.