MHBD: మహిళా కూలీలకు సమాన పనికి సమాన వేతనం చెల్లించేలాల ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని వ్య.కా.స మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలో భవనిర్మాణ రంగంలో పనిచేస్తున్న మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి హక్కుల సాధనకై ఉద్యమించాలని కూలీలకు సూచించారు.