ELR: వివిధ ప్రభుత్వ శాఖ కార్యాలయాల వద్ద ఏపీసీపీఎస్సీ నాయకులు సెప్టెంబర్ 1న ఛలో విజయవాడ కార్యక్రమం పోస్టర్లు ఇవాళ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ సీపీఎస్ఈఏ రాష్ట్ర కార్యదర్శి దుర్గారావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం పూర్తయిన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఉద్యోగులకు ఇవ్వవలసిన డీఏ బకాయిలు ఇవ్వలేదన్నారు.