AP: మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి.. ఆ చిన్న హామీని కూడా ప్రభుత్వం అమలు చేయడంలేదని X వేదికగా జగన్ మండిపడ్డారు. ‘CM చంద్రబాబు.. మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్ -7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ నమ్మించారు. అందుకే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ అంటూ పేర్కొన్నారు.