MDK: మెదక్ ఎస్పీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ అభివృద్ధి అంశాలపై నాలుగు ప్రధాన డిమాండ్లను ముఖ్యమంత్రికి వివరించారు. సీఎం వెంటనే స్పందించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రామాయంపేటలో పూర్తి సదుపాయాలతో కొత్త బస్ డిపో ఏర్పాటు చేయాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.