HYD: లింగంపల్లి, చర్లపల్లి, బేగంపేట తదితర రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలలో ప్రయాణికులు మర్చిపోయిన మొబైల్, బ్యాగులు, కీ చైన్, ఇతర సామాగ్రిని రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు ఓనర్లకు అందజేసినట్లుగా గురువారం తెలియజేశారు. రైల్వే పరిసరాలలో ఏదైనా పోగొట్టుకుంటే వెంటనే RPF బృందాలకు ఫిర్యాదు చేయాలన్నారు. దీంతో అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.