NGKL: కల్వకుర్తి పట్టణంలోని రైతులు ఉదయం నుంచి లైన్లో నిలబడి తిండి తిప్పల్లేక ఇబ్బంది పడుతున్నారు. రెండు మూడు రోజుల నుంచి వచ్చిన గాని ఒక యూరియా బస్తా దొరకని పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అనేక పాట్లు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం రైతుల బాధలు అర్థం చేసుకొని వారికి యూరియా బస్తాలను అందజేయాలని కోరుకుంటున్నారు.