KMR: నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్ట్ 27 గేట్లను ఎత్తేశారు. గురువారం ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 2,08,201 క్యూసెక్కుల నీటి ఇన్ ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్ట్ గేట్ల ద్వారా 2,20,256 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 16.790 TMCలు అని అధికారులు తెలిపారు.