KKD: గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ ఇంజనీరింగ్ కళాశాలలో డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఉదయం 6 గంటలకే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. 30 రూములలో డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతున్నట్లు డీఈవో రమేష్ తెలిపారు. అలాగే, అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.