NLG: బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ఓటర్ల జాబితాలోని లోపాలు వెంటనే గుర్తించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన సూచనలు పాటించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశముందని ఆయన గురువారం ఆరోపించారు.