కృష్ణా: రావెళ్ల ఫౌండేషన్ సేవలు పేదలకు వరంగా నిలుస్తున్నాయని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. గురువారం చల్లపల్లి మండలం మేకావారిపాలెంలో టీడీపీ సీనియర్ నాయకులు దివంగత రావెళ్ల కృష్ణ 24వ వర్ధంతి సందర్భంగా ఫౌండేషన్ ఛైర్మన్ రావెళ్ల ఉదయ్ కుమార్ పేదలకు సహాయం చేశారు. టీడీపీ కార్యకర్త అయ్యూబ్ ఖాన్కు రూ.10వేలు, విద్యార్థిని తులసికి రూ.10వేలు అందచేశారు.