KRNL: జీఆర్ఎస్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వివరాల ఆధారంగా ఆస్తి పన్ను మదింపు త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ విశ్వనాథ్ సిబ్బందిని ఆదేశించారు. ఇవాళ సమావేశ భవనంలో రెవెన్యూ విభాగం సిబ్బంది, అడ్మిన్లతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఆస్తి పన్ను మదింపు ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకతను సాధించడానికి ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించాలన్నారు.