WNP: గోపాలపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. యూరియా విక్రయాలను వ్యవసాయ అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించారు. క్యూ లైన్లో నిలబడిన రైతుల్లో ఇది వరకే 30 పైగా సంచులు తీసుకుని వెళ్లినవారు ఎవరైనా ఉంటే తనిఖీ చేసి వారిని పంపించేసేయాలని సూచించారు. నిలుచున్న రైతులతో కలెక్టర్ మాట్లాడారు.