MNCL:జిల్లాలో భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. భారీ వర్షాలతో జన్నారం మండలంలోని చింతగూడ, తిమ్మాపూర్, రాంపూర్ శివారులలో దెబ్బతిన్న పంటలను గురువారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోందని తెలిపారు. గోదావరి నది వైపు ఎవరూ రావద్దన్నారు.