AP: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ.4.9 కోట్ల క్రీడాప్రోత్సాహకాలను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు లబ్ధి చేకూరనుంది. క్రీడలు, క్రీడాకారుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందని శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు.