HYD: భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో జేఎన్టీయూ హైదరాబాద్ కీలక ప్రకటన చేసింది. యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు 29, 30 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను తక్షణమే వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. వాయిదా పడిన ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి తెలిపారు.