KMR: క్లౌడ్ బరస్ట్ ఊహించని పరిణామమని మంత్రి సీతక్క అన్నారు. కామారెడ్డిలో ముంపు ప్రాంతాలను గురువారం ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల వల్ల ఇద్దరు మృతి చెందారన్నారు. ఒకరు మిస్సింగ్ అయినట్లు చెప్పారు. ముంపు ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.