NRML: నిర్మల్ కేజీబీవీ పాఠశాలను గురువారం జిల్లా విద్యాధికారి రామారావు ఆకస్మికంగా సందర్శించారు. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాఠశాల పరిస్థితిని పరిశీలించారు. తరగతి గదులను, వంటగదిని పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు మేను ప్రకారం భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.