AP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రెడ్ బుక్ తాము తెచ్చింది కాదని.. ప్రజలే ఇచ్చారని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ పాపాలు పండే రోజు వస్తుందన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై సంతోషంగా ఉన్నారని చెప్పారు.