BDK: దమ్మపేట మండలం పార్కలగండి గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి సున్నం నాగబాబు ఇల్లు కూలిపోయింది. విషయం తెలుసుకున్న అశ్వారావుపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబళ్ల రవి ఆ కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. గ్రామాలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వరద నీరు ఇళ్లల్లోకి చేరుతున్నాయని, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.