ATP: జిల్లాలోని గణేష్ మండపాల్లో విభిన్న రూపాల్లో వినాయకులు పూజలందుకుంటున్నారు. అనంతపురంలోని నేరుగంటి వీధిలో చెఫ్ వినాయకుడిని కొలువుదీర్చారు. వినూత్నంగా ఉన్న ఈ గణపతి భక్తులను ఆకట్టకుంటున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుని ఫొటోలు దిగుతున్నారు. కాగా.. ఈ ఏడాది పట్టణంలో వందల సంఖ్యలో గణనాథులను ఏర్పాటు చేశారు.