మేడ్చల్: నిమజ్జనం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా శామీర్ పేట పెద్ద చెరువులో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం డీసీపీ సందర్శించారు. వారు మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా జరిగేలా చూడాలన్నారు.