MBNR: మహబూబ్నగర్ టూటౌన్ సీఐ ఐజాజుద్దీన్ గురువారం జిల్లా కేంద్రంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా యూరియాను తీసుకోవచ్చని తెలిపారు. యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఐదు సెంటర్లలో 67.5 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ జరిగిందని పేర్కొన్నారు.