వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 28న ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 382224 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. 2436 పోలింగ్ స్టేషన్లకు గాను 190031 పురుషులు, 192189 మహిళలు, 04 ఇతరులు ఉన్నారని తెలిపారు. ఓటరు జాబితాలో అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే బూత్ లెవెల్ అధికారిని సంప్రదించి సరి చేసుకోవాలని సూచించారు.