GNTR: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై ఘాటుగా స్పందించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. వీధి కుక్కల బెడదతో చిన్నారులు ప్రాణాలు కోల్పోయినా చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.