ELR: నూజివీడు పట్టణంలోని ఆర్ఆర్పేటలో ఇవాళ బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అనూష మాట్లాడుతూ.. బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్యవివాహాలతో ఏర్పడే అనర్ధాలను వివరించారు. ఐసీడీఎస్, సీడీపీవో పిల్లి విజయకుమారి, సూపర్వైజర్ ధనలక్ష్మి పాల్గొన్నారు.