HYD: ఓయూ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల రెండో సెమిస్టర్, రెగ్యులర్ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలను వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలన్నారు.